Nara Lokesh: ఎన్ని కేసులు పెట్టినా ‘అమరావతి ఉద్యమం’ ఆగదు: నారా లోకేశ్

  • అమరావతి ఉద్యమంలో భాగంగా యువకులను అరెస్టు చేశారు
  • నందిగామ సబ్ జైల్ లో ఉన్న వాళ్లను పరామర్శించాను
  • రైతుల దీక్షకు సంఘీభావం తెలిపాను
Nara Lokesh says Amaravathi agitation will continue

అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్టై నందిగామ సబ్ జైలులో ఉన్న యువకులను పరామర్శించినట్టు టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. ఈ అరెస్ట్ లను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో  నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నానని, అదేవిధంగా, రైతుల దీక్షకు సంఘీభావం తెలిపానని చెబుతూ వరుస ట్వీట్లు చేశారు.

నాడు ‘జై హింద్’ అన్న ప్రజలను బ్రిటిష్ వాళ్లు జైళ్లలో పెట్టారని, ఇప్పుడు ‘జై అమరావతి’ అంటూ నినదిస్తుంటే జైల్లో పెట్టిస్తున్నారంటూ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా అమరావతి ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా నందిగామ సబ్ జైల్ లో యువకులను పరామర్శించేందుకు తాను వెళ్లిన వీడియోను లోకేశ్ పోస్ట్ చేశారు. లోకేశ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు, ప్రజలు పోటీపడుతుండటం ఈ వీడియోలో కనబడుతుంది.

More Telugu News