One day cricket History: వన్డే క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు.. అమెరికా 35 పరుగులకే ఆలౌట్

  • ఐసీసీ ప్రపంచ కప్ లీగ్ వన్డేలో నేపాల్ చేతిలో అమెరికా ఓటమి
  • తొలుత బ్యాటింగ్ చేసి  35 పరుగులు చేసిన అమెరికా
  • రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన నేపాల్
Lowest Score registered in One day cricket History

ఐసీసీ క్రికెట్ చరిత్రలో వన్డేల్లో అత్యల్ప స్కోరు నమోదు అయింది. ఐసీసీ ప్రపంచ కప్ లీగ్ లో భాగంగా ఈ రోజు నేపాల్-అమెరికా జట్ల మధ్య జరిగిన వన్డేలో అమెరికా కేవలం 12 ఓవర్లు ఆడి  35 పరుగులకే ఆలౌటయింది. ఐసీసీ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. గతంలో అతి తక్కువ పరుగులు చేసిన రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. 2004లో శ్రీలంకతో ఆడుతూ జింబాబ్వే కేవలం 18 ఓవర్లలో 35 పరుగులు చేసి ఆలౌటయింది. అమెరికా తాజాగా సరిగ్గా అన్ని పరుగులే చేసి జింబాబ్వేతో సమానంగా నిలిచింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన నేపాల్ బౌలింగ్ ఎంచుకుంది. అమెరికన్ బ్యాట్స్ మెన్ లో ఓపెనర్ గ్జేవియర్ మార్షల్ మాత్రమే రెండంకెల స్కోరు(16)ను నమోదు చేశాడు, మిగతావారిలో ఎవరూ కూడా కనీసం ఐదు పరుగులు చేయలేకపోయారు. నేపాల్ బౌలర్లలో సందీప్ లామిచానే 16 పరుగులకు 6 వికెట్లు తీయగా, సుశాన్ బారి 5 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు.  అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా నేపాల్  5.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

More Telugu News