బాలికపై లైంగిక వేధింపులు.. బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు

12-02-2020 Wed 14:22
  • షహ్బాజ్ ఖాన్ పై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు
  • ఐపీసీ సెక్షన్లు 354, 509 కింద ఎఫ్ఐఆర్ నమోదు
  • పలు భాషా చిత్రాల్లో నటించిన షహ్బాజ్
Case Against Actor Shahbaz Khan For Allegedly Molesting Girl

బాలికను లైంగికంగా వేధించాడంటూ బాలీవుడ్ నటుడు షహ్బాజ్ ఖాన్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 354, 509 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. షహ్బాజ్ ఖాన్ పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలతో పాటు ఒక చైనీస్ సినిమాలో నటించాడు. వీటితో పాటు పంజాబీ, గుజరాతీ, కన్నడ సినిమాల్లో కూడా నటించాడు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఉస్తాద్ ఆమిర్ ఖాన్ కుమారుడే షహ్బాజ్ ఖాన్.