South Afica: బలిపీఠంపై మూగజీవాలు... 'ఆ ఏనుగులను చంపేయండి' అంటున్న ప్రభుత్వం!

  • వేలంపాట వేసి మరీ అనుమతిచ్చిన దక్షిణాఫ్రికా
  • పంటలు నాశనం చేస్తున్నాయని బోట్సవానా ప్రభుత్వం నిర్ణయం
  • ఇటీవలే ఒంటెలను చంపేందుకు అనుమతిచ్చిన ఆస్ట్రేలియా
south africa gives permission for killing eliphants

ఏదో ఒక కారణంతో మూగజీవాలను బలిపీఠంపైకి ఎక్కిస్తున్నాయి ఆయా దేశాల ప్రభుత్వాలు. నీటి కొరతకు ఒంటెలే కారణమవుతున్నాయన్న సాకుతో వాటిని చంపేందుకు ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిచ్చింది. తాజాగా దక్షిణాఫ్రికాలోని బోట్సవానా ప్రభుత్వం అటువంటి మార్గాన్నే ఎంచుకుంది.

వివరాల్లోకి వెళితే...దక్షిణాఫ్రికాలోని బోట్సవానాలో ఏనుగుల సంఖ్య అధికంగా ఉంది. ఆహారం కొరత కారణంగా ఇవి పంటపొలాలు, ఊళ్లపై పడుతున్నాయి. రైతులు కష్టపడి పండిస్తున్న పంటలు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నాయి.  ఈ ప్రమాదం అధికంగా ఉండడంతో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. జనావాసాల్లోకి వస్తున్న 70 ఏనుగులను మట్టుబెట్టేందుకు వేటగాళ్లకు అనుమతి ఇచ్చింది.

ఇందుకోసం బహిరంగంగా వేలం నిర్వహించి మరీ బాధ్యత కట్టబెట్టింది. అనుమతి తీసుకున్న వేటగాళ్లు మాత్రమే వాటిని చంపాలని ఆదేశించింది. జంతువులను వేటాడితే కఠినంగా శిక్షిస్తామనే ప్రభుత్వాలే ఇలా రాచమార్గంలో వాటిని బలిపీఠం ఎక్కిస్తుంటే వాటి మూగవేదన ఎవరికి అర్థమవుతుందని పలువురు మానవతావాదులు వాపోతున్నారు.

More Telugu News