Roja: శ్రీవారిని దర్శించుకున్న రోజా.. చంద్రబాబును తరిమికొట్టాలని ప్రజలకు పిలుపు

roja fires on chandra babu
  • ప్రజలు చైతన్యవంతులు 
  • నారా లోకేశ్‌ను మంగళగిరిలో ఓడించారు 
  • చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేయడం సిగ్గుమాలిన చర్య 
  • ఏపీ రాజధాని బిల్లు ఆమోదం పొందినట్లే 
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్న చంద్రబాబును రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు తరిమికొట్టాలని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రజలు చైతన్యవంతులు కాబట్టే నారా లోకేశ్‌ను మంగళగిరిలో ఓడించారని ఆమె చెప్పారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేయడం సిగ్గుమాలిన చర్యని ఆమె అన్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తున్నారని, ఏపీ సీఎం జగన్‌ మాత్రం ఏపీ అభివృద్ధికి కోసం పనిచేస్తున్నారని ఆమె అన్నారు.

లోకేశ్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న సామాజిక మాధ్యమాల్లో చేస్తోన్న అసత్య ప్రచారంపై ఒకవేళ ఫిర్యాదు చేస్తే 80 శాతం మంది టీడీపీ నేతలు జైల్లో ఉంటారని చెప్పారు. 14 రోజుల్లోపు సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయలేకపోయారని, దీంతో ఏపీ రాజధాని బిల్లు ఆమోదం పొందినట్లేనని తెలిపారు.
Roja
Chandrababu
Andhra Pradesh

More Telugu News