Chandrababu: రేపు రెండు పెళ్లిళ్లకు హాజరుకానున్న చంద్రబాబు

chandrababu will attend two nuptials tomorrow
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపు రెండు పెళ్లిళ్లకు హాజరుకానున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కుమారుడి పెళ్లికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లికి బాబు వెళ్లనున్నారు. ఈ వివాహానికి హాజరైన అనంతరం టీడీపీ నేత బొల్లినేని రామారావు కుమారుడి వివాహానికి కూడా బాబు వెళతారని సమాచారం. రేపు రాత్రికి బెంగళూరు వెళ్లి ఆ పెళ్లి వేడుకల్లో పాల్గొననున్నారు. ఆయా వివాహా వేడుకలకు హాజరై వధూవరులను చంద్రబాబు ఆశీర్వదించనున్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
wedding ceremonies

More Telugu News