Bumrah: బౌలింగ్ చేస్తోంది ఆ బుమ్రాయేనా..?

Bumrah wicketless as India loses ODI series
  • ఇటీవలే పునరాగమనం చేసిన బుమ్రా
  • కివీస్ తో వన్డే సిరీస్ లో ఒక్క వికెట్టూ తీయలేకపోయిన బుమ్రా
  • మూడు వన్డేల్లోనూ బుమ్రాను ఈజీగా ఎదుర్కొన్న కివీస్ బ్యాట్స్ మెన్
గాయం నుంచి కోలుకుని టీమిండియాలో పునరాగమనం చేసిన ఫాస్ట్ బౌలింగ్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా తాజా ప్రదర్శన చూసినవాళ్లు తీవ్ర విస్మయానికి గురవుతున్నారు. ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా కీర్తిపొందిన బుమ్రా కివీస్ తో మూడు వన్డేలు ఆడినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తిరుగులేని వేగంతో గురితప్పకుండా యార్కర్లు సంధించే నాటి బుమ్రాకు, ప్రత్యర్థులు అలవోకగా ఎదుర్కొంటున్న ఇప్పటి బుమ్రాకు ఎంతో తేడా కనిపిస్తోందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. వికెట్లు తీయలేకపోవడమే కాదు, అటు పరుగులు సైతం ధారాళంగా సమర్పించుకుంటున్నాడు.

న్యూజిలాండ్ తో తొలివన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 53 పరుగులు ఇచ్చాడు. రెండో వన్డేలో 10 ఓవర్లు వేసి 64 పరుగులు, మూడో వన్డేలో 10 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు. గతంలో బుమ్రా బౌలింగ్ లో పరుగులు తీయడానికి ఆపసోపాలు పడిన వాళ్లే ఇప్పుడు అలవోకగా ఆడేస్తున్నారు. మరికొన్నిరోజుల్లో కివీస్ తో రెండు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. అప్పటికైనా బుమ్రా తన పాత లయను దొరకబుచ్చుకోవాలని టీమిండియా మేనేజ్ మెంట్ కూడా కోరుకుంటోంది.
Bumrah
India
Team New Zealand
ODI Series
Wicketless

More Telugu News