రేపు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధానితో భేటీ!

11-02-2020 Tue 18:35
  • ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
  • హోం మంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం
  • పాలన వికేంద్రీకరణ, మండలి రద్దు అంశాలపై చర్చిస్తారని అంచనా
CM Jagan goes to Delhi tomorrow

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్  తన ఢిల్లీ పర్యటనలో భాగంగా  తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.

రాష్ట్రంలో కేబినెట్ సమావేశం ముగిశాక సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం ప్రధాని మోదీతో సమావేశం అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ, మండలి రద్దు వంటి అంశాలు వీరితో చర్చించే అవకాశముందని సమాచారం.