Paruchuri Gopalakrishna: సౌందర్య చనిపోయిందని తెలిసినప్పుడు తట్టుకోలేకపోయాను: పరుచూరి గోపాలకృష్ణ

  • సౌందర్య అంటే కదిలే అందం 
  •  వినయ విధేయతలు ఆమె సొంతం 
  •  ఆ రోజును మరిచిపోలేనన్న పరుచూరి గోపాలకృష్ణ
Paruchuri Gopalakrishna about soundarya

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో సౌందర్యను గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "సౌందర్య అంటే కదిలే అందం .. నిండుకుండవంటి వ్యక్తిత్వం ఆమె సొంతం. ఆమె చాలా సినిమాలు చేసి ఉండొచ్చు. ఆమెతో కలిసి మేము ఎనిమిది సినిమాలకి పనిచేశాము. ఆమెను చూసినవాళ్లు అలాంటి అక్క .. చెల్లెలు .. కూతురు వుంటే బాగుండుననుకుంటారు. ఫలానా పాత్ర సౌందర్య చేస్తే బాగుండుననుకునే అభిమానులు ఇప్పటికీ వున్నారు.

సౌందర్య మొదటి సినిమా నుంచి మాకు తెలుసు. ఆమెలో తొలి రోజుల్లో చూసిన వినయ విధేయతలనే చివరివరకూ చూశాము. 2004లో ఏప్రిల్ 17వ తేదీన నేను డాక్టరేట్ అందుకోబోతుండగా, హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయిందని తెలిసింది. ఆ వార్త విని నేను తట్టుకోలేకపోయాను. నా కళ్ల ముందు ఎదుగుతూ వచ్చిన అమ్మాయి, హఠాత్తుగా అలా అదృశ్యం కావడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News