'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం నుంచి 'కొమసావా ప్యారిస్' గీతం విడుదల

11-02-2020 Tue 16:34
  • విజయ్ దేవరకొండ హీరోగా 'వరల్డ్ ఫేమస్ లవర్'
  • ప్రేమికుల రోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
  • తాజాగా సరికొత్త వీడియో సాంగ్ రిలీజ్ చేసిన చిత్రబృందం
World Famous Lover unit releases Comosava Paris video song

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో వస్తున్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, క్యాథరిన్ ట్రెసా, ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లా లీట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఈ క్రమంలో తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం నుంచి 'కొమసావా ప్యారిస్' అనే వీడియో గీతాన్ని రిలీజ్ చేశారు. గోపీసుందర్ సంగీతంలో రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ గేయాన్ని బెన్నీ దయాళ్ ఆలపించారు. "జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. రండి 'కొమసావా ప్యారిస్' గీతంతో ప్రేమలో పడండి" అంటూ ఈ చిత్ర నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ ట్వీట్ చేసింది.