Arvind Kejriwal: ఘన విజయం తర్వాత కేజ్రీవాల్ స్పందన

Kejriwal says it is a win for Bharth Mata
  • ఇది భరతమాతకు దక్కిన విజయం
  • ఢిల్లీ సాధించిన విజయం
  • నన్ను కుమారుడిగా చూసిన ప్రతి కుటుంబ విజయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో గుమికూడిన మద్దతుదారులను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ ప్రసంగించారు. 'ఢిల్లీ ప్రజాలారా.. ఐ లవ్ యూ' అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆప్ సాధించిన ఈ విజయం సరికొత్త రాజకీయ వ్యవస్థకు ప్రతిరూపమని... ప్రజల కోసం పని చేయడమే ఆ వ్యవస్థ అని అన్నారు. ఇది భరతమాతకు దక్కిన విజయమని చెప్పారు.

'ఈ రోజు మంగళవారం. ఆంజనేయస్వామి దినం. ఢిల్లీ ప్రజలపై హనుమంతుడు ఆశీర్వచనాలను కురిపించాడు. థాంక్యూ హనుమాన్ జీ' అని కేజ్రీవాల్ అన్నారు. ఇది తాను సాధించిన విజయం కాదని... ఢిల్లీ సాధించిన విజయమని చెప్పారు. తనను కుమారుడిగా భావించిన ప్రతి కుటుంబ విజయమని అన్నారు. 24 గంటల పాటు విద్యుత్తు, నీరు, విద్యను పొందిన ప్రతి ఒక్కరి విజయమని చెప్పారు.
Arvind Kejriwal
Delhi Elections
AAP

More Telugu News