Northern Irland: ఉత్తర ఐర్లాండ్ లో ఇద్దరు యువతుల మధ్య పెళ్లి!

  • సజాతీయ వివాహలను చట్ట బద్ధం చేసిన ప్రభుత్వం
  • ఫిబ్రవరి 10 నుంచి నిషేధం ఎత్తివేత
  • కొన్నేళ్లుగా కలిసి ఉంటున్నామన్న యువతులు
Lesbians to get marry In Northern Irland

యునైటెడ్ కింగ్ డమ్(యూకే) లోని పలు ప్రాంతాల్లో సజాతీయ వివాహాలకు, (లెస్బియన్, గే) ఇప్పటికే అక్కడి ప్రభుత్వాలు ఓకే చెప్పాయి. తాజాగా ఐర్లండ్ కూడా అదే బాట పట్టడంతో బెల్ ఫ్లాస్ట్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులు(లెస్బియన్) పెళ్లికి సిద్ధమయ్యారు.

రాబిన్ పీపుల్స్ అనే 26 ఏళ్ల యువతి, షార్నీ ఎడ్వర్డ్ అనే 27 ఏళ్ల యువతిని ఈ రోజు వివాహం చేసుకోనుంది. ఉత్తర ఐర్లండ్ లో సజాతీయ వివాహం చేసుకున్న తొలిజంటగా వీరి జోడి రికార్డుల్లోకి ఎక్కనుంది. కాగా కొన్నేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటూ కలిసి ఉంటున్నామన్నారు. ఐదేళ్లుగా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నామని తెలిపారు.

‘మేము ఈ పెళ్లి వేడుక కోసం ఉత్సుకతతో ఉన్నాము. మాలో ఉద్విగ్నత నెలకొంది. పెళ్లి వేడుకలో ఇద్దరం వెడ్డింగ్ గౌను వేసుకుంటాము’ అని ఆ యువతులు మీడియాతో చెప్పారు. ఇంగ్లండ్, వేల్స్ 2014 మార్చిలో సజాతీయ వివాహాలు చేసుకోవచ్చని చట్టాలను సవరించగా, అదే ఏడాది డిసెంబర్ లో స్కాట్ లాండ్ కూడా ఈ తరహా వివాహాలకు ఓకే చెప్పింది. తాజాగా ఉత్తర ఐర్లాండ్ లో ఫిబ్రవరి 10 నుంచి దీనిపై ఉన్న నిషేధాలను ఎత్తి వేశారు.

More Telugu News