కేంద్రమంత్రి గడ్కరీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

11-02-2020 Tue 15:02
  • రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై మంత్రితో చర్చ
  • రహదారుల నిర్మాణంకోసం నిధుల మంజూరుపై హర్షం
  • హైదరాబాద్-కొత్తగూడెం ఎన్ హెచ్ మరమ్మతుల ప్రస్తావన
Congress MP komatireddy Venkatreddy meets Union minister Gadkari

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తెలంగాణలో రహదారుల నిర్మాణం గురించి మంత్రితో చర్చించారు. నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ వరకు రహదారి పనులకోసం రూ.200 కోట్లు, ఎన్ హెచ్-65 విస్తరణ పనులకోసం రూ.375 కోట్లు మంజూరు చేసినందుకు గడ్కరీకి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

కాగా, వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబ్ నగర్, ఇల్లెందు మీదుగా హైదరాబాద్ - కొత్తగూడెం మధ్య రహదారిని జాతీయ రహదారిగా గుర్తించినా మరమ్మతులు కావడంలేదని గడ్కరీకి ఎంపీ తెలిపారు. ఈ విషయంలో నాలుగేళ్ల క్రితం డీపీఆర్ సిద్ధమైనప్పటికీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదని కోమటిరెడ్డి చెప్పారు.