Aravind Kejriwal: న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ గెలుపు

Aravind kejriwal wins from New Delhi constituency
  • 13,508 ఓట్ల మెజార్టీతో కేజ్రీవాల్ విజయం
  • ఢిల్లీలో మరోసారి ఆప్ విజయకేతనం  
  • కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమం 
ఢిల్లీ శాసనసభ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. గెలుపు దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకెళుతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ విజయం సాధించారు. 13,508 ఓట్ల మెజార్టీతో కేజ్రీవాల్ గెలిచారు. పట్ పడ్ గంజ్, దేవ్ లీ, సంగం విహార్ నియోజకవర్గాల నుంచి  వరుసగా మనీశ్ సిసోడియా, ప్రకాశ్, మోహనియాలు విజయం సాధించారు. కాగా, ఢిల్లీలో మరోసారి ఆప్ విజయకేతనం ఎగురవేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించనుంది.
Aravind Kejriwal
AAP
New Delhi
constiuency

More Telugu News