ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్

11-02-2020 Tue 14:11
  • ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
  • మళ్లీ అధికారంలోకి వస్తున్న ఆప్
  • మరికొన్నిరోజుల్లో కొత్త అసెంబ్లీ
Lieutenant Governor dissolves Delhi Assembly

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ సత్తా మరోసారి స్పష్టమైంది. ప్రధాన ప్రత్యర్థి బీజేపీని మట్టికరిపించే రీతిలో ఆప్ తన ప్రభంజనాన్ని చాటింది. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ హ్యాట్రిక్ కొట్టేసిన నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరోసారి ఆప్ ప్రభుత్వం ఏర్పడనుంది. మరికొన్నిరోజుల్లో ఏడో అసెంబ్లీ కొలువు దీరనుంది.