ఢిల్లీలో ఇండియా ఆత్మను గెలిపించారు: ప్రశాంత్ కిషోర్

11-02-2020 Tue 13:31
  • ఆప్ విజయంపై పొలిటికల్ స్ట్రాటజిస్టు ట్వీట్
  • ఆప్ గెలుపు కోసం వ్యూహాలు రచించిన ప్రశాంత్
  • ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన లీడర్
Thanks Delhi For Protecting Indias Soul

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇండియా ఆత్మను గెలిపించారని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం నేపథ్యంలో ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘‘ఇండియా ఆత్మను రక్షించుకునేందుకు అండగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు.

2014 జనరల్ ఎలక్షన్ల సమయం నుంచి ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చారు. ఆ ఎలక్షన్లలో బీజేపీ తరఫున ప్రచార వ్యూహాలను అమలు చేసి మోదీ గెలుపు కోసం తోడ్పడ్డారు. ఆ తర్వాత కూడా పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేశారు. ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. తాజాగా ఢిల్లీ ఎలక్షన్లలో అరవింద్ కేజ్రీవాల్ కు తోడుగా ఆప్ తరఫున ప్రచార వ్యూహాలు రూపొందించారు.