High Court: అమరావతి కేసులకు ముకుల్ రోహత్గిని నియమించడంపై హైకోర్టులో పిల్

pill filed in ap high court against appointment of Mukul as counsel
  • ప్రభుత్వం తరఫున వాదించేందుకు రోహత్గి నియామకం
  • రూ.5 కోట్ల ఫీజు చెల్లింపును సవాల్ చేస్తూ పిల్
  • రోహత్గిని నియమించడం న్యాయవాదుల చట్టానికి విరుద్ధమంటూ పిల్
అమరావతి రాజధాని అంశంపై దాఖలైన కేసులను వాదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించిన విషయం తెలిసిందే. రోహత్గీ ఫీజు కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాజధాని కేసులకు ముకుల్ రోహత్గిని నియమించడంపై హైకోర్టులో ఈ రోజు పిల్ దాఖలైంది.

ప్రభుత్వం తరఫున వాదించేందుకు ముకుల్ రోహత్గి నియామకాన్ని సవాల్ చేస్తూ ఈ పిల్ వేశారు. రూ.5 కోట్ల ఫీజు చెల్లింపును కూడా సవాల్ చేశారు. ప్రభుత్వం తరఫున రోహత్గిని నియమించడం న్యాయవాదుల చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు.
High Court
Amaravati
Andhra Pradesh
YSRCP

More Telugu News