సంబరాల్లో మునిగితేలుతోన్న ఢిల్లీ ఆప్ కార్యకర్తలు.. టపాసులు పేల్చొద్దని కేజ్రీవాల్ ఆదేశం

11-02-2020 Tue 13:18
  • ఢిల్లీలో కాలుష్యం దృష్ట్యా కేజ్రీవాల్ నిర్ణయం
  • మిఠాయిలు పంచుకోవాలని సూచన
  • విజయం దిశగా ఆప్‌
dont use crackers kejriwal orders

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం దిశగా దూసుకెళుతోన్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టపాసులు పేల్చొద్దని తమ పార్టీ నేతలు, కార్యకర్తలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు.

వాటికి బదులుగా మిఠాయిలు పంచాలని చెప్పారు. దీంతో ఆయన ఆదేశాలను ఆప్ నేతలు కార్యకర్తలు పాటిస్తున్నారు. టపాసులకు బదులుగా బెలూన్లను గాల్లోకి వదిలిపెడుతూ, మిఠాయిలు పంచుకుంటూ పండుగ చేసుకుంటున్నారు.