BJP: మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది: ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్

 We are hopeful says Delhi BJP Chief Manoj Tiwari
  • ఆమ్ ఆద్మీ పార్టీ- బీజేపీ మధ్య ఫలితాల్లో తేడాలు కనపడుతున్నాయి
  • పూర్తి ఫలితాలు వెలువడడానికి ఇంకా సమయం ఉంది
  • ఫలితాలు ఎలా వచ్చినప్పటికీ నాదే బాధ్యత
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడో సారి విజయం దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోన్న నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఈ విషయంపై స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆమ్ ఆద్మీ పార్టీ- బీజేపీ మధ్య ఫలితాల్లో తేడాలు కనపడుతున్నాయని అన్నారు. తమ కంటే ఆప్ కొన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, పూర్తి ఫలితాలు వెలువడడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు.

విజయంపై తమకు ఇప్పటికీ నమ్మకం ఉందని మనోజ్ తివారీ అన్నారు. అయితే, ఫలితాలు ఎలా వచ్చినప్పటికీ, ఢిల్లీ బీజేపీ చీఫ్‌గా ఆ పార్టీ ఓటమి లేక గెలుపునకు తనదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. కాగా, ఎన్నికల ఫలితాల్లో ఆప్ 52, బీజేపీ 17, కాంగ్రెస్ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
BJP
New Delhi
elections

More Telugu News