'అరణ్య' కోసం రంగంలోకి దిగుతోన్న రానా

11-02-2020 Tue 09:31
  • హిందీలో 'హాథీ మేరే సాథీ'
  • తెలుగు టైటిల్ గా 'అరణ్య'
  • ఏప్రిల్ 2వ తేదీన విడుదల  
Ranas Hindi movie dubbed into Telugu as Aranya

'నేనే రాజు నేనే మంత్రి' తరువాత రానా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆలస్యమైందనే చెప్పాలి. అందువలన త్వరలో ఆయన హిందీతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనున్నాడు. హిందీలో ఆయన చేసిన 'హాథీ మేరే సాథీ'ని తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో ఈ సినిమాకి 'అరణ్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. హిందీతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కొంతకాలం క్రితం అస్సాం - కజరంగా ప్రాంతంలో మానవ చర్యల వలన 20 ఏనుగులు ఏ విధంగా ఆశ్రయాన్ని కోల్పోయాయి, తిరిగి అవి ఒకే చోటుకి ఎలా చేర్చబడ్డాయి అనే యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రభు సొలొమన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.