ఈ ఫొటో, కామెంట్ చూసి సారా అలీఖాన్, కార్తీక్ ఆర్యన్ ప్రేమను ఖరారు చేసేస్తున్న నెటిజన్లు!
- సారాకు భోజనం తినిపించిన కార్తీక్
- బాగా బరువు పెరగాలని సలహా
- ఇద్దరి మధ్యా ప్రేమ నిజమేనంటున్న ఫ్యాన్స్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సారా, తనకు తొలి ప్రేమపై నమ్మకం ఉందని తెలిపింది. తనది కూడా అటువంటి ప్రేమేనని చెప్పింది. ఇదిలావుంచితే, తాజాగా, సారా నోటికి గోరుముద్దలు తినిపిస్తున్న కార్తీక్ ఆర్యన్ చిత్రం ఒకటి వైరల్ అయింది. దీనికి క్యాప్షన్ గా "నువ్వు చాలా సన్నగా అయిపోయాయి. బాగా తిని మళ్లీ బరువు పెరగాలి" అంటూ కార్తీక్ ఓ క్యాప్షన్ ను పెట్టాడు. ఇక ఈ ఫొటో, క్యాప్షన్ చూసిన వాళ్లంతా వారిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.