Kathi Mahesh: శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్.. కత్తి మహేశ్ పై పోలీస్ కేసు

Police case filed against Kathi Mahesh
  • ‘శ్రీరాముడి ఫేవరెట్ డిష్ నెమలి తొడ..’ అంటూ పోస్ట్
  • మహేశ్ వి అనుచిత వ్యాఖ్యలంటూ ఆరోపణ
  • నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
‘శ్రీరాముడి ఫేవరెట్ డిష్ నెమలి తొడ, జింక మాంసం..’ అంటూ ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేశ్ ఇటీవల చేసిన పోస్ట్ లు వివాదాస్పదమయ్యాయి. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మహేశ్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ పై హైదరాబాద్ లోని నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది కరుణసాగర్ ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు మేరకు కత్తి మహేశ్ పై కేసు నమోదు చేసినట్టు సమాచారం. కాగా, మహేశ్ పై ఇవే ఆరోపణలు చేస్తూ పలు పీఎస్ లలో ఫిర్యాదులు అందుతున్నట్టు తెలుస్తోంది.
Kathi Mahesh
Film critic
Nampally PS
case file

More Telugu News