Nikhil Gowda: నిఖిల్ గౌడ నిశ్చితార్థ వేడుకలో రాజకీయ నాయకుల సందడి

 Political leaders attend Actor Nikhil Gouda's engagement function
  • కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ నిశ్చితార్థం
  • కాంగ్రెస్ నేత కృష్ణప్ప మేనకోడల్ని వివాహం చేసుకోబోతున్న నిఖిల్ గౌడ
  • నిశ్చితార్థ కార్యక్రమానికి విచ్చేసిన రాజకీయ, సినీ ప్రముఖులు
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కుటుంబంలో పెళ్లిసందడి నెలకొంది. త్వరలో కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ వివాహం జరగనుంది. తాజాగా నిఖిల్ గౌడకు కాంగ్రెస్ నాయకుడు కృష్ణప్ప మేనకోడలు రేవతితో నిశ్చితార్థం జరిగింది. బెంగళూరులోని హోటల్ తాజ్ వెస్ట్ ఎండ్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది. ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. నిఖిల్ గౌడ తాత దేవెగౌడ, కర్ణాటక సీఎం యడియూరప్ప, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కుమారస్వామి వ్యాఖ్యానిస్తూ, హసన్ తన జన్మస్థలం అయినా, తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది రామనగర ప్రాంతమేనని, అందుకే రామనగర, మాండ్య జిల్లాల వారందరినీ తన కుమారుడి పెళ్లికి ఆహ్వానిస్తానని తెలిపారు. కాగా, నిఖిల్ గౌడ సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ కాలుమోపారు. అయితే, ఆమధ్య జరిగిన ఎన్నికల్లో సుమలత చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. 
Nikhil Gowda
Kumara Swamy
Revathi
Banglore
Engagement
Wedding

More Telugu News