Ram mohan naidu: ఆరేళ్లలో విభజన హామీలు పది శాతం కూడా నెరవేరలేదు!: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • వైజాగ్ కు రైల్వేజోన్ ఇచ్చినా ఉపయోగం లేదు
  • ‘పోలవరం’ పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉంది
  • నరేగా నిధుల విడుదలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి

ఆరేళ్లలో ఏపీ పునర్విభజన హామీలు పది శాతం కూడా నెరవేర్చలేదని కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ఏం రావాల్సి ఉందో ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని చెప్పారు. వైజాగ్ కు రైల్వేజోన్ ఇచ్చామని కేంద్రం చెబుతున్నప్పటికీ ఆదాయం వచ్చే ప్రాంతం మాత్రం ఆ జోన్ పరిధిలో లేదని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉందని, నరేగా నిధుల విడుదలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఫలానావి ఇచ్చామని స్పష్టంగా లేవని విమర్శించారు. ఈ సందర్భంగా వైసీపీపై ఆయన విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని నాడు ఎన్నికల సమయంలో వైసీపీ హామీ ఇచ్చిందని, ఆ ‘హోదా’ను ఎలా సాధిస్తారో రాష్ట్ర ప్రజలకు తెలియజెెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News