నీ అవినీతి గురించి ఏ స్టేషన్ కు వెళ్లినా చెబుతారు: గోరంట్ల మాధవ్ పై బుద్ధావ్యాఖ్యలు

09-02-2020 Sun 18:54
  • మాధవ్ అవినీతిలో సిద్ధహస్తుడంటూ విమర్శలు
  • హిందూపురం నుంచి తరిమేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యలు
  • మాధవ్ కారణంగానే కియా అనుబంధ సంస్థలు వెళ్లిపోయాయని ఆరోపణలు
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోరంట్ల మాధవ్ బెదిరింపుల వల్లే కియా అనుబంధ సంస్థలు వెళ్లిపోయాయని ఆరోపించారు. మాధవ్ అవినీతిలో సిద్ధహస్తుడని వ్యాఖ్యానించారు. మాధవ్ సీఐగా చేసిన ఏ స్టేషన్ కు వెళ్లినా అతని అవినీతి  గురించి చెబుతారు అంటూ విమర్శించారు. ఒక్క చాన్స్, ఒక్క చాన్స్ అనడం వల్ల అందరితోపాటే మాధవ్ కు కూడా ఓటేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. మాధవ్ ను హిందూపురం నుంచి ఎప్పుడు తరిమేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.

అమరావతి రెఫరెండంపై విశాఖ జిల్లాలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, గుంటూరు ఎంపీ రాజీనామాకు సిద్ధమని వెల్లడించారు. ఇదే అంశంపై రాజీనామాకు రాజధానిలోని వైసీపీ ఎమ్మెల్యేలను, ఎంపీని అవంతి ఒప్పించాలని సవాల్ విసిరారు. వైసీపీ నేతల భూకబ్జాలతో విశాఖ ప్రజలు భయంతో బతుకుతున్నారని వ్యాఖ్యానించారు.