KTR: అప్పట్లో కేటీఆర్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలావుందో చూడండి!

  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్
  • మరో పాత జ్ఞాపకాన్ని పంచుకున్న ఐటీ మంత్రి
  • ట్విట్టర్ లో తన ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పోస్టు చేసిన వైనం
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత క్రియాశీలకంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరికే సాయం కావాలన్నా స్పందించడమే కాదు, తనకు సంబంధించిన అనేక విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా, తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను ట్విట్టర్ లో పోస్టు చేశారు. "1998లో జారీ అయిన నా తొలి ఇంటర్నేషనల్ లైసెన్స్ దొరికింది... ఇదిగో చూడండి" అంటూ ట్వీట్ చేశారు.

కాగా, ఆ లైసెన్స్ ను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రవాణా విభాగం జారీ చేసింది. అందులో తన పేరును కల్వకుంట్ల తారక రామారావుగా పేర్కొన్న కేటీఆర్, తండ్రి పేరును, జన్మస్థలాన్ని, పుట్టినతేదీని కూడా పేర్కొన్నారు. 1976 జూలై 24న సిద్ధిపేటలో ఆయన జన్మించినట్టు ఆ లైసెన్స్ కార్డులో చూడొచ్చు.
KTR
Driving License
Andhra Pradesh
TRS
Telangana

More Telugu News