Cpi Ramakrishna: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్సెన్షన్ వేటు సరికాదు: సీపీఐ నేత రామకృష్ణ

  • కక్ష సాధింపు ధోరణిలా కనిపిస్తోంది
  • రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్షన్ ధోరణితో ముందుకెళ్తోంది
  • ప్రభుత్వం తీరుతో అధికారుల్లో అభద్రతా భావం  
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ  మండిపడ్డారు. వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయడం సబబు కాదని, కక్ష సాధింపు ధోరణిలా కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్షన్ ధోరణితో ముందుకెళ్తోందని, ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే అధికారుల్లో అభద్రతాభావం నెలకొంటుందని అన్నారు.  
Cpi Ramakrishna
IPS
AB Venkateswara Rao
YSRCP
Government
Andhra Pradesh

More Telugu News