Road Accident: టాటా ఏస్ ను ఢీకొట్టిన టిప్పర్... ఐదుగురు దుర్మరణం!

  • కుమారుడికి వైద్యం చేయించి తీసుకెళుతున్న కుటుంబం
  • వేగంగా వచ్చి ఢీకొట్టిన గ్రానైట్ లోడ్ తో ఉన్న టిప్పర్
  • కేసును దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
కరీంనగర్ జిల్లాలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలితీసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గంగాధర మండలం కురిక్యాల వద్ద శనివారం రాత్రి టాటా ఏస్ వాహనాన్ని వేగంగా వస్తున్న ఓ గ్రానైట్ లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొంది. మృతులు కొడిమ్యాల మండలం పూడూరు వాసులుగా గుర్తించారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, ఐదో వ్యక్తి టాటా ఎస్ డ్రైవర్. క్యాబిన్ లో డ్రైవర్ గడ్డం అంజయ్య మృతదేహం ఇరుక్కుపోగా, పోలీసులు దాదాపు గంట పాటు శ్రమించి బయటకు తీయాల్సి వచ్చింది.

ఇటీవల మేకల బాబు అనే యువకుడు బైక్ నుంచి కిందపడగా, అతనికి కరీంనగర్ లో వైద్యం చేయించి, ఇంటికి తీసుకుని వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. మృతుల్లో బాబుతో పాటు అతని తండ్రి మేకల నర్సయ్య, సోదరుడు బానయ్య, సోదరుడి కుమారుడు శేఖర్ మరణించారు. దీంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. 
Road Accident
Karimnagar District
TaTa Ace
Tipper

More Telugu News