China: చైనాలో ఘోరం.. 'నేను రాను' అంటూ అరుస్తున్నప్పటికీ కరోనా అనుమానితులను తాళ్లతో కట్టి తీసుకెళ్తున్న వైనం

  • చైనాను వణికిస్తోన్న కరోనా భయం
  • వందలాది మంది మృతి
  • కఠినంగా వ్యవహరిస్తోన్న చైనా
చైనాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలను కరోనా వైరస్ వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశంలో ఈ వైరస్ మరింత ప్రబలకుండా చైనా కఠినంగా వ్యవహరిస్తోంది. కరోనా అనుమానితులను వెతికి పట్టుకుని మరీ భద్రతా సిబ్బంది ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

తమకు కరోనా లేదని కొందరు చెబుతున్నప్పటికీ వారిలో వ్యాధికారక సూచనలు కనపడుతున్నాయంటూ బలవంతంగా తాళ్లతో కట్టేసి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. తమను ఆసుపత్రికి తీసుకెళ్లొద్దని, తాము రాబోమని కేకలు పెడుతున్నప్పటికీ కొందరిని ఆసుపత్రులకు తరలించి కఠినంగా వ్యవహరించారు. కాగా, కరోనా వైరస్ కారణంగా చైనాలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందికి ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు.
China
Corona Virus

More Telugu News