Chandrababu: తెలంగాణలో మన పరిస్థితేంటి?: నేడు హైదరాబాద్ లో చంద్రబాబు ప్రత్యేక భేటీ!

  • ఉదయం 11 గంటలకు హైదరాబాద్ కు చంద్రబాబు
  • పార్టీ బలోపేతంపైనే ప్రధాన చర్చ
  • హాజరుకానున్న పలువురు నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ కు చేరుకోనున్న ఆయన, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై స్థానిక నేతలతో చర్చించనున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి స్థానిక నాయకత్వం చేపడుతున్న చర్యలపైనే ఈ భేటీ జరుగనుంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగనున్న ఈ సమావేశానికి పలువురు పార్టీ నేతలు హాజరు కానున్నారు.

కాగా, గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ, నామమాత్రపు ప్రభావాన్ని కూడా చూపించలేక పోయింది. ఆపై పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని కోల్పోయిన తరువాత, తెలంగాణలో పార్టీని బలపరచాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే నేడు జరిగే సమావేశంలో స్థానిక నేతలతో చర్చించి, తెలంగాణలో తిరిగి క్యాడర్ ను నిర్మించుకునే ఉద్దేశంలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. 
Chandrababu
Telugudesam
Hyderabad
Telangana

More Telugu News