Nirmala Sitharaman: అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నాను: నిర్మలా సీతారామన్

  • 1న పార్లమెంట్ ముందుకు బడ్జెట్
  • బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేయని నిర్మల
  • మొత్తం పేజీలను చదవాల్సివుండాల్సిందని వ్యాఖ్య
ఈ నెల ఒకటో తారీఖున పార్లమెంట్ లో 2020-21 వార్గిక బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించే వేళ, తాను అసౌకర్యాన్ని కలిగించానని, అందుకు చింతిస్తున్నానని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమర్పణను నిర్మల పూర్తి చేయలేకపోయారన్న సంగతి తెలిసిందే. చివర్లో కొన్ని పేజీలను చదవకుండానే, ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసినట్టు చెప్పి కూర్చుండిపోయారు. తాజాగా తన ప్రసంగంపై స్పందించిన నిర్మలా సీతారామన్, ఆర్థిక రంగానికి సంబంధించిన ప్రతి విషయంపైనా విపులంగా, జాగ్రత్తగా మాట్లాడాల్సి రావడంతోనే ఎక్కువ సేపు ప్రసంగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. తాను చివరిలో నీళ్లు తాగిన తరువాత, మిగతా పేజీలను కూడా చదివి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని తెలిపారు.
Nirmala Sitharaman
Budget
Parliament

More Telugu News