భారీగా తగ్గిన పెట్రోలు ధర!

  • జనవరి 12 నుంచి తగ్గుతున్న ధరలు
  • ఫిబ్రవరిలో 82 పైసలు తగ్గిన పెట్రోలు ధర
  • ఢిల్లీలో రూ. 72.45కు లీటరు పెట్రోలు
వరుసగా మూడవ రోజు కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు దిగివచ్చాయి. గత నెల 12వ తేదీ నుంచి ధరలు తగ్గడం ప్రారంభం కాగా, ఫిబ్రవరి నెలలోనే లీటరు పెట్రోలుపై 82 పైసలు, డీజిల్ పై 85 పైసల మేరకు ధర తగ్గింది. తాజాగా పెట్రోలుపై 24 పైసలు, డీజిల్ పై 27 పైసల మేరకు ధర తగ్గించినట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి.

తాజా ధరలను పరిశీలిస్తే, న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 72.45, డీజిల్‌ ధర రూ.65.43గా ఉండగా, ముంబయిలో పెట్రోల్ రూ. 78.11, డీజిల్‌ రూ. 68.57గా ఉంది. ఇక విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ. 76.63, డీజిల్‌ ధర రూ.70.91గాను, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 77.08, డీజిల్‌ ధర రూ.71.35గా ఉంది.
Go Back to Shorts
Petrol
Diesel
Price Cut

More Telugu News