అందుకే నిరర్ధక ఆస్తులు విపరీతంగా పెరిగాయి: నిర్మలా సీతారామన్
- లోపాలను పరిష్కరించేందుకు నాలుగేళ్లు పట్టిందని వెల్లడి
- బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే తమకు ఫిర్యాదు చేయాలని సూచన
- ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వెల్లడి
గతంలో చోటుచేసుకున్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ లోని అంశాలను ట్రేడర్లకు విడమర్చి చెప్పారు. సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు బ్యాంకులు ఎలాంటి కారణం చెప్పకుండా రుణాలు మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు ప్రతిని సదరు బ్యాంకు మేనేజర్ కు కూడా పంపాలని తెలిపారు. ఇలాంటి ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.