Sharwanand: 'జాను' తొలిరోజు వసూళ్లు

  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'జాను'
  • యూఎస్ లో అంతగా లభించని ఆదరణ 
  •  శని .. ఆదివారాల్లో వసూళ్లు పెరిగే ఛాన్స్

ప్రేమించే వయసులో దానిని వ్యక్తం చేయడానికి ధైర్యం చాలదు. వయసుతో పాటు అలాంటి ధైర్యం వచ్చాక ప్రేమించే అవకాశం ఉండదు. ఈ కంటెంట్ తో తమిళంలో వచ్చిన '96' .. కన్నడలో వచ్చిన '99' చిత్రాలు విజయాలను అందుకున్నాయి. అదే కథ 'జాను' చిత్రంగా రూపొంది నిన్న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శర్వానంద్ - సమంత నాయకా నాయికలుగా కనిపించారు.

'దిల్' రాజు నిర్మించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 2.4 కోట్ల షేర్ ను రాబట్టింది. శర్వానంద్, సమంతకి గల క్రేజ్ ను బట్టి చూసుకుంటే ఇవి తక్కువ వసూళ్లేనని అంటున్నారు. ఇక యూఎస్ లోను ఈ సినిమా వసూళ్లు అంతంత మాత్రంగానే వున్నాయని చెబుతున్నారు. శని .. ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తమిళంలో కాసుల వర్షాన్ని కురిపించిన ఈ కథ, తెలుగులోనూ ఆ దిశగా పరుగులు తీస్తుందేమో చూడాలి.

More Telugu News