'నా యువ స్నేహితుల్లారా.. ':ఢిల్లీ పోలింగ్ సందర్భంగా మోదీ ట్వీట్

  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
  • ఓటర్లను ఉద్దేశించి తొలి ట్వీట్ చేసిన మోదీ
  • రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావాలని పిలుపు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోదీ తొలి ట్వీట్ చేశారు. 'ఢిల్లీ ప్రజలు... ముఖ్యంగా నా యువ స్నేహితులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావాలి' అని ప్రధాని పిలుపునిచ్చారు.

ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారపర్వం యుద్ధాన్ని తలపించేలా సాగిన సంగతి తెలిసిందే. బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో సైతం ప్రకంపనలు పుట్టించాయి. 70 మంది ఎమ్మెల్యేలు ఉండే ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ఇప్పుడు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉండగా... మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఆప్ సర్వశక్తులను ఒడ్డింది.
Go Back to Shorts
Delhi
Assembly Elections
Narendra Modi

More Telugu News