Bellamkonda Srinivas: బెల్లంకొండ మూవీకి భారీ బడ్జెట్టునే కేటాయించారట

  • 'రాక్షసుడు'తో పలకరించిన హిట్ 
  • తదుపరి సినిమా దర్శకుడిగా సంతోష్ శ్రీనివాస్
  • నాయికలుగా నభా నటేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ 
తొలి సినిమాతోనే మాస్ హీరోగా మంచిమార్కులు సంపాదించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్, ఆ తరువాత భారీ బడ్జెట్ లో సినిమాలు చేస్తూ వెళ్లాడు. అలా ఆయన చేస్తూ వెళ్లిన సినిమాల్లో 'సాక్ష్యం' .. 'కవచం' .. 'సీత' సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. నష్టాలను కూడా బాగానే తెచ్చిపెట్టాయి. దాంతో ఆయనతో భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి నిర్మాతలు వెనుకాడారు.

ఈ కారణంగానే 'రాక్షసుడు' సినిమాను తక్కువ బడ్జెట్లో చేశారు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సినిమా నిర్మాతలు బాగానే ఖర్చు చేస్తున్నారట. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించి, నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో ఎంత మాత్రం రాజీ పడటం లేదని అంటున్నారు. యాక్షన్ సీన్స్ ను కూడా భారీగానే ప్లాన్ చేశారని చెబుతున్నారు. నభా నటేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో, విలన్ గా సోనూ సూద్ ను తీసుకున్నారు.
Bellamkonda Srinivas
Nabha Natesh
Anu Emmanuel
Santhosh Srinivas Movie

More Telugu News