Amaravati: రాజధాని అమరావతి పరిధి నుంచి ఐదు గ్రామాల తొలగింపు.. సంచలన ఉత్తర్వులు జారీ

  • ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి గ్రామాలను నగర పరిధి నుంచి తప్పించిన ప్రభుత్వం
  • తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల్లో విలీనం
  • కోర్టులో సవాలు చేస్తామన్న రైతులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నగర పరిధి నుంచి ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి గ్రామాలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాడేపల్లి, మంగళగిరి పురపాలక సంఘాల్లో వీటిని విలీనం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రభుత్వ నిర్ణయంపై ఆ ఐదు గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. కుట్రపూరితంగానే తమ గ్రామాలను రాజధాని నగర పరిధి నుంచి తొలగించారని ఆరోపిస్తున్నారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని రైతులు తెలిపారు.
Amaravati
Andhra Pradesh
Farmers

More Telugu News