Anil kukar Yadav: జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మమైపోతారు: ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

  • టీడీపీని స్థాపించింది ఎన్టీఆర్
  • బాబు వెంట ఉన్నది ఎన్టీఆర్ అభిమానులు
  • చంద్రబాబు కొత్త పార్టీ స్థాపించి పోటీకి రావాలి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఈరోజు ఆయన మాట్లాడుతూ, జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మమైపోతారని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని వదిలేసి, మరో పార్టీని స్థాపించి పోటీకి రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. టీడీపీపై ఉన్న అభిమానంతో ఓట్లు పడుతున్నాయే తప్ప, చంద్రబాబును చూసి కాదని, బాబు వెంట ఉన్నది ఎన్టీఆర్ అభిమానులని అన్నారు. ఈ సందర్భంగా జగన్ గురించి ప్రస్తావిస్తూ, మంత్రి కాకముందే జగన్ కు తాము భక్తులమని చెప్పారు.
Anil kukar Yadav
YSRCP
Chandrababu
Telugudesam
NTR
Jagn
cm

More Telugu News