Prabhas: ప్రభాస్ మూవీ టైటిల్ మారుతుందా?

  • షూటింగు దశలో ప్రభాస్ సినిమా 
  • ప్రేమ నేపథ్యంలో సాగే కథ 
  • కొత్తగా రిజిస్టర్ చేయించిన టైటిల్స్    

ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ వారు ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో కృష్ణంరాజు ఒక భాగస్వామిగా వున్నారు. ఈ సినిమాకి మొదటినుంచీ 'జాన్' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ వారు తాజాగా 'ఓ డియర్' .. 'రాధేశ్యామ్' అనే రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది.

ప్రభాస్ సినిమా కోసమే ఈ టైటిల్స్ ను రిజిస్టర్ చేయించి వుంటారా? అనే విషయం స్పష్టంగా తెలియదు. అయితే ప్రస్తుతం ప్రభాస్ .. పూజా హెగ్డే చేస్తున్న ఈ సినిమా ప్రేమకథాంశం కావడం వలన, ఈ సినిమా కోసమే ఆ టైటిల్స్ ను రిజిస్టర్ చేయించారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. గతంలో ప్రభాస్ కి 'డార్లింగ్' వంటి టైటిల్ కలిసి రావడం వలన కూడా ఇప్పుడు టైటిల్ మార్పుకు కారణం కావొచ్చని భావిస్తున్నారు.  

More Telugu News