Priyanka Jawalkar: రెండు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన 'టాక్సీవాలా' హీరోయిన్

  • 'టాక్సీవాలా'తో లభించిన హిట్ 
  • కిరణ్ జోడీగా ఒక సినిమా 
  •  శివ కందుకూరి సరసన మరో మూవీ

విజయ్ దేవరకొండ సరసన నాయికగా 'టాక్సీవాలా' సినిమాతో తెలుగు తెరకి ప్రియాంక జవల్కర్ పరిచయమైంది. తొలి సినిమానే విజయ్ దేవరకొండతో చేసే ఛాన్స్ రావడం .. 'టాక్సీవాలా' హిట్ కావడంతో ఈ సుందరి దశ తిరిగిపోయినట్టేనని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో అలా జరగలేదు. ఆ తరువాత అమ్మడు ప్రేక్షకులను పలకరించలేదు. దాంతో ప్రియాంక జవల్కర్ ను అంతా మరిచిపోయారని చెప్పాలి.

అయితే అదృష్టం కలిసొచ్చి ఈ సుందరిని రెండు అవకాశాలు పలకరించాయి. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరో అనిపించుకున్న కిరణ్, మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. ఈ  సినిమాలో కథానాయికగా ఆయన ప్రియాంక జవల్కర్ ను ఎంపిక చేసుకున్నాడు. ఇక శివ కందుకూరి హీరోగా దర్శకురాలు సుజన ఒక సినిమాను రూపొందించనుంది. ఈ సినిమాలో ఆయన జోడీగా ఆమె ప్రియాంకను తీసుకుంది. ఈ రెండు విజయాన్ని సాధిస్తే ప్రియాంక కెరియర్ ఊపందుకునే అవకాశాలు వున్నాయి.

More Telugu News