Amaravati: అమరావతి రైతుల పోరాటం చూస్తే రాజధాని తరలిపోదనిపిస్తోంది: మాజీ ఎంపీ రాయపాటి

  • వంద రోజులైనా వారు వెనక్కి తగ్గేలా లేరు
  • రేపు ప్రధానిని కలవనున్నారు
  • ఆ తర్వాత ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం

అమరావతి రైతుల పోరాట పటిమ చూస్తే రాజధాని ఎక్కడికీ తరలిపోదని, వెలగపూడిలోనే ఉంటుందనిపిస్తోందని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. వంద రోజులైనా తమ పోరుబాటను విడిచిపెట్టేలా రైతులు కనిపించడం లేదని చెప్పారు. ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రైతు జేఏసీ ప్రతినిధులు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారని, రేపు ప్రధాన మంత్రిని కలవనున్నారని చెప్పారు. ప్రధాని మోదీని కలిశాక రాజధాని అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

More Telugu News