సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

06-02-2020 Thu 07:10
  • పవన్ కల్యాణ్ సరసన మరోసారి శ్రుతి
  • వంశీ సినిమాలో మహేశ్ ద్విపాత్రాభినయం?  
  • నాని 'టక్ జగదీశ్' అప్ డేట్  

 *  గతంలో పవన్ కల్యాణ్ సరసన 'గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు' చిత్రాలలో నటించిన శ్రుతిహాసన్ ఇప్పుడు మరోసారి ఆయనతో జోడీ కట్టే అవకాశాన్ని పొందనుంది. పవన్ తో హరీశ్ శంకర్ రూపొందించే చిత్రంలో కథానాయిక పాత్రకు శ్రుతిహాసన్ ను కాంటాక్ట్ చేస్తున్నట్టు సమాచారం.  
*  తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనీ, ఈ చిత్రకథ మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందనీ తెలుస్తోంది.
*  హీరో నాని తన తదుపరి చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడు. 'టక్ జగదీశ్' పేరిట రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలవుతుంది. కాగా, ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేసే విధంగా చిత్ర నిర్మాణాన్ని ప్లాన్ చేస్తున్నారు.