న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియాను వదలని జరిమానాలు
- ఇప్పటికే రెండు టి20ల్లో టీమిండియాకు జరిమానాలు
- తొలి వన్డేలో 80 శాతం మ్యాచ్ ఫీజు కోత
- స్లో ఓవర్ రేట్ పర్యవసానం
- పొరబాటును అంగీకరించిన కోహ్లీ
ఇప్పుడు వన్డేలో మరింత షాకిచ్చారు. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటా పూర్తిచేయలేదంటూ ఏకంగా ఆటగాళ్ల ఫీజులోంచి 80 శాతం జరిమానా విధించారు. నిర్ణీత సమయానికి టీమిండియా 4 ఓవర్లు ఆలస్యమైనట్టు గుర్తించారు. ఒక్కో ఓవర్ కు 20 శాతం చొప్పున మొత్తం 80 శాతం జరిమానా వడ్డించారు. దీనికి సంబంధించి మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ విచారణ జరపగా, టీమిండియా సారథి కోహ్లీ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ ఉండదు.