కోరలు చాస్తున్న కరోనా వైరస్... వేలకోట్ల నష్టం అంచున సూరత్ వజ్రాల పరిశ్రమ
- హాంకాంగ్ లో ఎమర్జెన్సీ విధింపు
- నెలరోజుల పాటు అత్యయిక స్థితి
- హాంకాంగ్ నుంచి తిరుగుముఖం పట్టిన భారత వజ్రాల వ్యాపారులు
- రూ.8 వేల కోట్ల మేర నష్టం తప్పదని అంచనా
ప్రస్తుతం హాంకాంగ్ లో కరోనా వైరస్ కారణంగా ఎమర్జెన్సీ విధించారు. దాంతో గుజరాత్ వజ్రాల వ్యాపారులు భారత్ కు తిరుగుముఖం పట్టారు. నెలరోజుల పాటు హాంకాంగ్ లో అత్యయిక పరిస్థితి విధించడంతో అక్కడి మార్కెట్ లావాదేవీలు మందగమనంలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సూరత్ వజ్రాల పరిశ్రమకు సుమారుగా రూ.8 వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, హాంకాంగ్ లో జరగాల్సిన అంతర్జాతీయ ఆభరణాల ఎగ్జిబిషన్ రద్దయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.