ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: టీడీపీ ఎంపీ కనకమేడల

05-02-2020 Wed 14:56
  • రాజధానిని తరలించే అధికారం ప్రభుత్వానికి లేదు
  • రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది
  • ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు

ఏపీ రాజధానిగా అమరావతి ఇప్పటికే నోటిఫై అయిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ గుర్తుచేశారు. రాజధానిని తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లోకూరుకుపోయిందని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, రైతులను కాపాడాలని కోరారు.