Rajamouli: రాజమౌళి తదుపరి సినిమా హీరో ప్రభాస్

  • 'ఆర్ ఆర్ ఆర్' షూటింగులో బిజీగా రాజమౌళి 
  • ఆయన కాంబినేషన్ పట్ల ప్రభాస్ ఆసక్తి 
  •  సుముఖతను వ్యక్తం చేసిన రాజమౌళి    

ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగులో బిజీగా వున్నారు. ఎన్టీఆర్ - చరణ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత ఏ హీరోతో రాజమౌళి సినిమా ఉండనుంది? అనే ప్రశ్నకి సమాధానంగా ప్రభాస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాల షూటింగు నిమిత్తం సుదీర్ఘ కాలం పాటు కలిసి ప్రయాణం చేయడం వలన, ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అందువలన రాజమౌళితో సినిమా చేయడానికి ప్రభాస్ ఆసక్తిని చూపడంతో, ఆయన అందుకు సుముఖతను వ్యక్తం చేశారట. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందనీ, 2022లో ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అంటున్నారు. ఓ మాదిరి బడ్జెట్ లోనే ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.

More Telugu News