కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా భారత్
- హామిల్టన్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్
- 59 పరుగులతో దూకుడుగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్
వన్ డౌన్ లో బరిలోకి దిగిన కోహ్లీ 51 పరుగులు చేసి సోధీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్ (59), కేఎల్ రాహుల్ (25) ఉన్నారు. భారత స్కోరు 35.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు. టీమిండియా ఇదే దూకుడును కొనసాగిస్తే స్కోరు 300 పరుగులు దాటే అవకాశం ఉంది.