ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటీ నిజం కాదు: బీజేపీ నేత రఘునందన్
- బీజేపీ నేత రఘునందన్ పై తీవ్ర ఆరోపణలు
- అత్యాచారం చేశాడన్న మెదక్ జిల్లా మహిళ
- ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియడంలేదన్న రఘునందన్
- ఆ మహిళ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని వెల్లడి
కాగా, తనపై వస్తున్న ఆరోపణల పట్ల రఘునందన్ స్పందించారు. ఆ మహిళ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, నూటికి నూరు శాతం అవన్నీ అబద్ధాలేనని అన్నారు. ఈ అంశంలో తనమీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మరోసారి వివరణ ఇస్తానని వెల్లడించారు. అంతేకాదు, తనకు ఈ వ్యవహారంలో ఎవరూ నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.