Punarnavi: విడుదలకి ముస్తాబవుతున్న పునర్నవి సినిమా

  • సస్పెన్స్ థ్రిల్లర్ గా 'ఒక చిన్న విరామం'
  • నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథ 
  • ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు 

తెలుగులో పునర్నవి చిన్న చిన్న పాత్రలను చేస్తూ వెళుతోంది. 'బిగ్ బాస్ 3' రియాలిటీ షోతో ఆమె పాప్యులర్ అయింది. ఆ తరువాత ఆమె చేసిన సినిమానే 'ఒక చిన్న విరామం'. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పునర్నవి .. సంజయ్ వర్మ .. నవీన్ .. గరిమా సింగ్ ప్రధానమైన పాత్రలను పోషించారు.

ఈ సినిమాను గురించి దర్శకుడు సందీప్ చేగూరి మాట్లాడుతూ .. "ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాము. అడుగడుగునా ఈ సినిమా అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేకెత్తిస్తుంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ కథ తప్పకుండా నెక్ట్ అవుతుంది. పునర్నవి కెరియర్ కి ఈ సినిమా మరింత హెల్ప్ అవుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

More Telugu News