Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఆసుపత్రి నుంచి అదృశ్యమైన కరోనా లక్షణాలున్న వ్యక్తులు

  • వుహాన్ నుంచి కొన్నిరోజుల క్రితమే భారత్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు
  • స్క్రీనింగ్ లో జలుబుతో బాధపడుతున్నట్టు వెల్లడి
  • కరోనా నిర్ధారణ కోసం శాంపిల్స్ సేకరణ

మధ్యప్రదేశ్ లో కరోనా వైరస్ లక్షణాలున్న ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రి నుంచి అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. వీరిద్దరూ చైనా నుంచి వచ్చినవారే. వుహాన్ నుంచి భారత్ వచ్చిన వారిని మధ్యప్రదేశ్ ని ఛతర్ పూర్ జిల్లా ఆసుపత్రిలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఒకరు ఎంబీబీఎస్ విద్యార్థి. అతను ఛతర్ పూర్ సమీపంలోని నౌగాంగ్ ప్రాంతానికి చెందినవాడు. వుహాన్ నుంచి భారత్ చేరుకున్న వీరికి స్క్రీనింగ్ నిర్వహించగా, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్టు తేలడంతో కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుకు తరలించారు. అనంతరం, కరోనా వైరస్ నిర్ధారణ కోసం శాంపిల్స్ సేకరించారు. ఆ తర్వాత నుంచి వారిద్దరూ కనిపించలేదు. వీరిలో ఒకరి ఆచూకీ గురించి కుటుంబ సభ్యులకూ సమాచారం లేదు.

More Telugu News